Sat Mar 21 2026 11:27:24 GMT+0530 (India Standard Time)
Road Accident : హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
. హైదరాబాద్ శివార్లలో ఉన్న హయత్ నగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు

హైదరాబాద్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ శివార్లలో ఉన్న హయత్ నగర్ లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించారు. హయత్ నగర్ పరిధిలోని కుంట్లూరు వద్ద ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మరొకరికి తీవ్ర గయాలయ్యాయి.
అతివేగమే...
కారులో ఉన్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. అయితే గాయపడిన ఒకరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మరణించిన వారి పేర్లు తెలియాల్సి ఉంది. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

