Tue Mar 17 2026 13:49:20 GMT+0530 (India Standard Time)
కాకినాడలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి
కాకినాడ షుగర్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు మరణించగా కొందరికి తీవ్ర గాయాలయ్యాయి

కాకినాడలో ఘోర ప్రమాదం జరిగింది. ముగ్గురు మరణించారు. కాకినాడ షుగర్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు మరణించగా కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడ సమీపంలోని వాకలపూడి షుగర్ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. నలుగురికి గాయాలయినట్లు తెలిసింది.
పేలుడు సంభవించి...
ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ఫ్యాక్టరీలోని కన్వేయర్ బెల్టు వద్ద పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గాయపడిన నలుగురిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

