Fri Dec 05 2025 14:34:13 GMT+0000 (Coordinated Universal Time)
డబ్బు, నగలు కాదు.. ఏకంగా లారీలనే దొంగతనం చేస్తున్నారు
కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో లారీల దొంగతనం కలకలం రేపుతోంది. బస్టాండ్ సమీపంలో నిలిపి ఉంచిన లారీని కొందరు..

ఇళ్లలో డబ్బు, నగలు దోచుకెళ్లడం.. బైకుల దొంగతనాలు, షాపులలో దొంగతనాలు మనమంతా చూసే ఉంటాం. కానీ లారీలను దొంగతనం చేయడం కనీవినీ ఎరుగం. అది తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా దొంగతనాలు ఎక్కడా ఉండవు. ఇటీవల వింత దొంగతనాలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్న ఓ దొంగ కిచెన్ లోకి వెళ్లి పాలను వేడిచేసుకుని తాగి.. మళ్లీ వాటిని కడిగి అక్కడే పెట్టి వచ్చేశాడు. మరో దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సును దొంగతనం చేయడం వైరల్ అయింది. ఇలాంటి దొంగతనాలతో దొంగలు ఏం టార్గెట్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి.
కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో లారీల దొంగతనం కలకలం రేపుతోంది. బస్టాండ్ సమీపంలో నిలిపి ఉంచిన లారీని కొందరు దొంగలు ఎత్తుకెళ్లారు. ఒకటి కాదు..రెండుకాదు.. ఏకంగా మూడు లారీలను చోరీ చేశారు. ఓ లారీ డ్రైవర్ తన లారిని కాగజ్ నగర్ బస్టాండ్ వద్ద నిలిపి పని పై మరోచోటుకు వెళ్లాడు. పని ముగించుకుని వచ్చేసరికి లారీ మాయమైంది. షాకైన ఆ డ్రైవర్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. లారీని సిర్పూర్ టి బార్డర్ దాటిస్తున్న దృశ్యాలు కనిపించాయి. పోలీసులు ఆ లారీ దొంగలను వెంటనే పట్టుకుంటామని చెబుతున్నారు.
Next Story

