Thu Dec 18 2025 07:37:06 GMT+0000 (Coordinated Universal Time)
కరెంట్ షాక్ తో మూడు ఏనుగులు మృతి
ధర్మపురి జిల్లా మరందనహళ్లిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కాళీ కౌండర్ కొట్టాయ్ గ్రామంలో..

తమిళనాడులో తీవ్రవిషాదం నెలకొంది. కంచెదాటుతుండగా కరెంట్ షాక్ తగిలి మూడు ఏనుగులు మృతి చెందాయి. ధర్మపురి జిల్లా మరందనహళ్లిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కాళీ కౌండర్ కొట్టాయ్ గ్రామంలో అడవి పందుల బెడద నుంచి పంటను కాపాడుకునేందుకు ఓ రైతు తన పొలానికి కంచె వేశాడు. ఆ కంచెకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చాడు. గుంపుగా వచ్చిన ఏనుగులు ఆ కంచెను దాటేందుకు ప్రయత్నించగా.. విద్యుత్ షాక్ తగిలి మూడు ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందాయి.Three elephants electrocuted in Tamil Nadu's Dharmapuri, farmland owner arrested
సాధారణంగా జంతువుల నుంచి తమ పంటలను కాపాడుకునేందుకు తమ పొలాలకు ఇనుప కంచెలు ఏర్పాటు చేసుకుంటారు. వాటిని దాటుతూనే ఏనుగుల గుంపులు ఆహారం, నీటి కోసం వెతుకుతూ వెళ్తుంటాయి. ఈ క్రమంలోనే కంచెలకు విద్యుత్ ను ఏర్పాటు చేయడం వల్ల ఏనుగులు మరణించడం పలువురిని కలచివేసింది. ఏనుగుల మృతికి కారణమైన కంచెను ఏర్పాటు చేసిన రైతుపై అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. అనుమతి లేకుండా విద్యుత్ కంచెను ఏర్పాటు చేసినందుకు సదరు పొలం యజమానిని అరెస్ట్ చేశారు.
Next Story

