Thu Mar 19 2026 04:41:04 GMT+0530 (India Standard Time)
ఏనుగుల గుంపును ఢీ కొట్టిన వాహనం.. మూడు మృతి
పలమనేరు సమీపంలోని జగమర్ల అటవీ ప్రాంతం నుంచి రోడ్డు దాటుతున్న ఏనుగులను తిరుపతి బెంగళూరు నేషనల్ హైవే పై..

అటవీ ప్రాంతం నుంచి రోడ్డు దాటుతున్న ఏనుగుల గుంపు రోడ్డుప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మూడు ఏనుగులు మృతి చెందాయి. పలమనేరు సమీపంలోని జగమర్ల అటవీ ప్రాంతం నుంచి రోడ్డు దాటుతున్న ఏనుగులను తిరుపతి బెంగళూరు నేషనల్ హైవే పై చెన్నై వైపుగా కూరగాయల లోడుతో వెళ్తోన్న వాహనం ఢీ కొట్టింది. వాహనం వేగంగా ఢీ కొట్టడంతో మూడు ఏనుగులు మృతి చెందాయి. వాటిలో రెండు గున్న ఏనుగులు ఉన్నాయి. ఒక ఏనుగు ఎగిరి రోడ్డుకు అవతలి వైపు పడి మరణించగా.. మరో రెండు వాహనం క్రాష్ బారియర్స్ తగిలి మృతి చెందాయి.
ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా దెబ్బతినడంతో.. డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యాడు. ఈ ప్రమాదం కారణంగా తిరుపతి బెంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు, పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతి చెందిన ఏనుగులను పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. కౌండిన్య అభయారణ్యం నుంచి రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు.
Next Story

