Thu Mar 19 2026 04:25:49 GMT+0530 (India Standard Time)
కుషాయిగూడ టింబర్ డిపోలో అగ్నిప్రమాదం.. ముగ్గురి సజీవదహనం
ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో టింబర్ డిపోలో మంటలు చెలరేగి క్షణాల్లోనే పక్కనున్న ..

హైదరాబాద్ లో మరో అగ్నిప్రమాదం జరిగింది. కుషాయిగూడ టింబర్ డిపోలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో టింబర్ డిపోలో మంటలు చెలరేగి క్షణాల్లోనే పక్కనున్న భవనానికి వ్యాపించాయి. ఆ భవంతిలో నిద్రిస్తున్న దంపతులు సహా చిన్నారి మంటల్లో చిక్కుకుని మరణించారు. మరో చిన్నారి ఆచూకీ ఇంకా తెలియలేదు.
మృతులు యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తికి చెందిన నరేశ్ (35), సుమ (28), జోషిత్ (5)గా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మిస్సైన మరో చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Next Story

