Sun Mar 15 2026 22:46:48 GMT+0530 (India Standard Time)
Breaking : ఏసీ బోగీల్లో పొగలు.. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు
తిరువనంతపురం ఎక్స్ప్రెస్ రైలుకు పెద్ద ప్రమాదం తప్పింది. ఏసీ బోగీల్లో పొగలు రావడంతో రైలును మధ్యలోనే ఆపేశారు

తిరువనంతపురం ఎక్స్ప్రెస్ రైలుకు పెద్ద ప్రమాదం తప్పింది. ఏసీ బోగీల్లో పొగలు రావడంతో రైలును మధ్యలోనే ఆపేశారు. ఘటన ను చూసి షాక్ గురయిన ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. చెన్నై శివారులోని నెమిలిచ్చేరిలో ఈ ఘటన జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
వరస ప్రమాదాలతో...
వరసగా రైలు ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. ఏసీ బోగీల్లో మంటలు వ్యాపించడం సర్వ సాధారణంగా మారింది. రైలులో ప్రయాణించాలంటే ప్రయాణికులు భయపడిపోతున్నారు. తాజాగా జరిగిన ఘటనపై రైల్వే శాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. పొగలు రావడానికి కారణాలపై విచారణ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
Next Story

