Sat Mar 07 2026 14:58:01 GMT+0530 (India Standard Time)
ఏటీఏం చోరీ.. ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు
ఏటీఎంలో దొంగలు చోరీ చేసి పారిపోతున్నారు. అందిన సమాచారంతో వారిని పోలీసులు సినిమా తరహాలో ఛేజ్ చేశారు.

ఏటీఎంలో దొంగలు చోరీ చేసి పారిపోతున్నారు. అందిన సమాచారంతో వారిని పోలీసులు సినిమా తరహాలో ఛేజ్ చేశారు. చివరకు పట్టుకున్నారు. చోరీ చేసిన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల లో నిన్న రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఏటీఎంలో ఉన్న 19 లక్షల రూపాయలను చోరీ చేశారు. ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరాను మూసివేసి ఏటీఎంను పగుల కొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు.
స్థానికులు అందించిన సమాచారంతో...
అయితే స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి సినిమా తరహాలో వారిని ఛేజ్ చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు దొంగిలించిన నగదు మొత్తం రోడ్డుపై నోట్లు పడ్డాయి. పండగ పూట అందరూ ఆదమరిచి ఉన్న నేపథ్యంలో దొంగలు ఏటీఎంను లక్ష్యంగా చేసుకుని చోరీకి ప్రయత్నించారు. చివరకు దొంగలను పట్టుకుని, నగదును స్వాధీనం చేసుకున్నారు.
Next Story

