Thu Jan 29 2026 05:03:37 GMT+0000 (Coordinated Universal Time)
Tadepalli : తాడేపల్లిలో దొంగల స్వైర విహారం..వరస దొంగతనాలతో
తాడేపల్లి లోని ఉండవల్లిలో దొంగలు బీభత్సం సృష్టించారు. వరుసగా రెండు సూపర్ మార్కెట్లు ఒక మోడల్ డైరీలో నగదు దోచుకెళ్లారు

తాడేపల్లి లోని ఉండవల్లిలో దొంగలు బీభత్సం సృష్టించారు. వరుసగా రెండు సూపర్ మార్కెట్లు ఒక మోడల్ డైరీలో నగదు దోచుకెళ్లారు. దొంగలు మోడల్ డైరీలో 40వేలు, సీతారామాంజనేయ సూపర్ మార్కెట్లో అరవై వేలు ఓ చిల్లర కొట్టు లో డెబ్భయి వేలు దోచుకెళ్లినట్లు స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.
చిరు వ్యాపారుల నుంచి...
అర్ధరాత్రి నుంచి దొంగలు తాడేపల్లి లోని వివిధ దుకాణాలను టార్గెట్ గా చేసుకని ఈ చోరీలకు పాల్పడ్డారని వ్యాపారులు చెబుతున్నారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. వరుస దొంగతనాలతో చిరు వ్యాపారులు తాము సంపాదించిన సొమ్మంతా పోగొట్టుకుని ఇబ్బంది పడుతున్నారు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

