ఇంట్లో వాళ్లకు ఏదో జరుగుతోందనే భయం.. 40 ఏళ్ల తర్వాత లొంగిపోయాడు
దాదాపు నలభై ఏళ్ల క్రితం రెండు హత్యలు జరిగాయి.

దాదాపు నలభై ఏళ్ల క్రితం రెండు హత్యలు జరిగాయి. పోలీసులు సరైన సాక్ష్యాలు దొరకలేదని కేసును మూసేశారు. కానీ ఆ రెండు హత్యలు చేసింది తానేనని ఓ వ్యక్తి పోలీసుల ముందుకు వచ్చి లొంగిపోయాడు. అందుకు కారణం ఏమిటో తెలుసా? అతడి కుటుంబంలో చోటు చేసుకుంటున్న పరిణామాలే!! ఓ ప్రమాదంలో పెద్ద కుమారుడు చనిపోగా, చిన్న కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. మానసిక సంఘర్షణకు గురైన అతడు దాదాపు నలభై ఏళ్ల క్రితం రెండు హత్యలు చేశానంటూ పోలీసుల ముందు లొంగిపోయాడు. ఆ రహస్యాన్ని దాచిపెట్టి బతకడం ఇక తన వల్ల కావడం లేదని చెప్పాడు. కేరళలోని కొయ్‌కోడ్‌కు చెందిన మహమ్మదాలి మలప్పురం జిల్లాలోని వెంగరా పోలీస్‌స్టేషనులో లొంగిపోయాడు.
1986 ప్రాంతంలో ఓ వ్యక్తి తనను వేధించేవాడని, ఆత్మరక్షణలో భాగంగా అతడిని తన్నడంతో ఓ కాలువలో పడిపోయినట్లు మహమ్మదాలి పోలీసులకు చెప్పాడు. వెల్లయిల్ బీచ్‌లో 1989లో మరో వ్యక్తిని హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.