Sun Mar 15 2026 13:40:53 GMT+0530 (India Standard Time)
America : అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఒకరి మృతి
అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. కాన్సాస్ సిటీలో జరిగిన ఈ కాల్పుల ఘటనలో ఒకరు మరణించగా ఇరవై మందికి పైగా గాయపడ్దారు

అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. కాన్సాస్ సిటీలో జరిగిన ఈ కాల్పుల ఘటనలో ఒకరు మరణించగా ఇరవై మందికి పైగా గాయపడ్దారు. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. కాన్సాస్ సిటీలో జరిగిన కవాతులోలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. సూపర్ బౌల్ ఫైనల్ లో విజయం సాధించిన కాన్సాస్ సిటీ చీఫ్స్ జట్టు విజయోత్సవాలు నిర్వహిస్తుండగా కాల్పులకు తెగబడ్డారు.
పదుల సంఖ్యలో గాయాలు...
కాల్పులకు భయపడి ప్రజలు భయంతో పరుగులు తీశారు. పెద్దయెత్తున ప్రజలు ఈ కవాతుకు హాజరు కావడంతో కొంత మేర తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమీపంలోని పెట్రోలు బంకు నుంచి కాల్పుల శబ్దం వినిపించిందని అంటున్నారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని పట్టుకున్న పోలీసులు అతడిని విచారిస్తున్నారు. పోలీసులు విచారణ తర్వాత కాల్పులకు కారణం ఏమై ఉంటుందన్నది తెలుస్తుంది.
Next Story

