Mon Mar 16 2026 03:11:42 GMT+0530 (India Standard Time)
వినాయక నిమజ్జనంలో అపశృతి.. ఇద్దరు గల్లంతు.. ఒకరి మృతి
కాకినాడ జిల్లాలో జరిగిన వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. సముద్రంలో ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యారు

కాకినాడ జిల్లాలో జరిగిన వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. సముద్రంలో ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వినాయక నిమజ్జనం కోసం వెళ్లిన విద్యార్థులు సముద్రంలో కొట్టుకుపోయారు. వీరిలో ముగ్గురిని సురక్షితంగా కాపాడగలిగారు. ఒక విద్యార్థి మృతి చెందారు.
మరో ఇద్దరి కోసం....
మరో ఇద్దరు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. యు. కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సహాయక బృందాలు ఇద్దరు విద్యార్థుల కోసం సముద్రంలో గాలిస్తున్నాయి. నిమజ్జనానికి వెళ్లి సముద్రంలో స్నానాలు చేస్తూ విద్యార్థులు గల్లంతయినట్లు సమచారం.
Next Story

