Sun Mar 15 2026 15:24:37 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్ లో కాల్పుల వెనక కథ ఇదీ
హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. మాదాపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. మాదాపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. రియల్ ఎస్టేట్ లో వివాదాలే కాల్పులకు కారణాలుగా పోలీసులు భావిస్తున్నారు. మాదాపూర్ నీరూస్ సెంటర్ లో జరిగిని కాల్పుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇస్మాయిల్ మృతి చెందారు. మరో వ్యక్తి జహంగీకర్ కు తీవ్ర గాయాలయ్యాయి. జహంగీర్ ను వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
తాడిబండ్ లోని..
ఈ వివాదానికి తాడ్బండ్ లోని 250 గజాల భూమి కారణమని తెలుస్తోంది. కొన్నాళ్ల క్రితం మహ్మద్ పేరుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇస్మాయిల్ గిఫ్ట్ డీడ్ ేశారు. వివాదం పరిష్కారానికి ఇస్మాయిల్ ను మహ్మద్ మాదాపూర్ కు పిలిపించగా ఒక్కసారి జిలానీ కాల్పులు జరిపాడు. ఇస్మాయిల్ ను దగ్గర నుంచి కాల్చడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితో పాటు ఉన్న జహంగీర్ అడ్డుకునే ప్రయత్నించగా అతనికి గాయాలయ్యాయి. మహ్మద్ అనుచరుడే జిలానీగా చెబుతున్నారు.
Next Story

