Sat Mar 07 2026 20:43:16 GMT+0530 (India Standard Time)
పార్శిల్ లో డెడ్ బాడీ..ఏపీలో షాకింగ్ కదా?
పార్సిల్ లో డెడ్ బాడీని తెచ్చి ఇచ్చిన ఘటన ఉండి మండలం యండగండిలో జరిగింది.

పార్సిల్ లో డెడ్ బాడీని తెచ్చి ఇచ్చిన ఘటన ఉండి మండలం యండగండిలో జరిగింది. తులసి అనే మహిళకు ఒక పార్శిల్ వచ్చిందని చెప్పి ఒక వ్యక్తి వచ్చి ఇచ్చిపోయాడు. అయితే ఆ పార్శిల్ ను ఓపెన్ చేసిన వెంటనే అందులో డెడ్ బాడీ ఉండటంతో తులసి తో పాటు కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
కుళ్లిపోయిన స్థితిలో....
మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండటం, దుర్వాసన రావడంతో వెంటనే ఆ పార్శిల్ ను పోస్టుమార్టానికి పోలీసులు తరలించారు. ఈ పార్శిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు వచ్చారు? ఎందుకు తెచ్చారు? ఆ డెడ్ బాడీ ఎవరిది? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. జిల్లా ఎస్పీ ఘటన స్థలికి వచ్చి పరిస్థితులను అధ్యయనం చేశారు. పార్శిల్ ఇచ్చి వెళ్లిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీ టీవీ కెమెరాలను పరిశీలించి అతనిని పట్టుకుంటే తప్ప పార్శిల్ ఎక్కడి నుంచి వచ్చిందన్నది తెలియదు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

