Sun Mar 15 2026 19:40:55 GMT+0530 (India Standard Time)
బీజాపూర్ లో ఎన్ కౌంటర్
బీజాపూర్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు సమాచారం

బీజాపూర్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు సమాచారం. ఎన్కౌంటర్ తర్వాత, గాయపడిన ఒకరితో సహా ఇద్దరు మావోయిస్టులను సంఘటనా స్థలం నుండి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఒక మావోయిస్టు మృతి...
ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఎన్కౌంటర్ ప్రారంభమైంది. డీ.ఆర్.జీ జవాన్లతో ఎన్కౌంటర్ ప్రారంభమైంది. మావోలు అక్కడ ఉన్నారని తెలిసి వెళుతుండగా ఇరు వైపుల నుంచి కాల్పులు జరిగాయని చెబుతున్నారు. నైమెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కచ్లవారిలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. .
Next Story

