Fri Mar 20 2026 18:56:32 GMT+0530 (India Standard Time)
మోసం చేశాడని ప్రియుడిపై యువతి కత్తితో దాడి
హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి తనను మోసం చేశాడని ఒక యువతి ప్రియుడిపై కత్తితో దాడికి దిగింది.

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి తనను మోసం చేశాడని ఒక యువతి ప్రియుడిపై కత్తితో దాడికి దిగింది. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కానీ కొంతకాలంగా యువతికి ఆ యువకుడు దూరంగా ఉంటున్నాడు.
పోలీసుల అదుపులో....
కత్తి దాడిలో గాయపడిన యువకుడిని లంగర్ హౌస్ పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యువకుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని చెబుతున్నారు. దాడికి పాల్పడిన యువతిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Next Story

