Thu Mar 19 2026 05:29:27 GMT+0530 (India Standard Time)
విషాదం.. డ్రైనేజీలో పడి ముగ్గురి మృతి
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో విషాదం నెలకొంది. డ్రైనేజీలో పడి ముగ్గురు వ్యక్తులు మరణించారు.

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో విషాదం నెలకొంది. డ్రైనేజీలో పడి ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ ఘటనలో ఇద్దరు కూలీలతో పాటు ఇంటి యజమాని కూడా మరణించారు. సత్తెనపల్లిలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న న్యూ వినాయక రెస్టారెంట్ లో డ్రైనేజీని శుభ్రపరుస్తుండగా ఈ ఘటన జరిగింది.
ఒక్కసారిగా గుంటలో పడటంతో...
ఇద్దరు కూలీలు డ్రైనేజీలో మురికిని బయటకు తీస్తుండగా యజమాని వారి చేత పని చేయిస్తున్నారు. ఒక్కసారి ముగ్గురు గుంటలో పడటంతో మరణించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతి చెందన వారు కొండలరావు, అనిల్, బ్రహ్మంలుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story

