Mon Mar 16 2026 09:57:13 GMT+0530 (India Standard Time)
Big Breaking : విజయవాడలో విషాదం.. డాక్టర్ ఇంట్లో ఐదుగురు మృతి
విజయవాడ గురునానక్ నగర్ లో విషాదం నెలకొంది. ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ కుటుంబంలో ఐదుగురు మృతి చెందారు

విజయవాడ గురునానక్ నగర్ లో విషాదం నెలకొంది. ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ కుటుంబంలో ఐదుగురు మృతి చెందారు. ఇది అనుమానాస్పద మృతి గా పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. డాక్టర్ శ్రీనివాస్ కుటుంబంలో ఐదుగురు మరణించడంతో ఇది హత్యా? ఆత్మహత్యా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హత్యా? ఆత్మహత్యా?
మృతుల్లో డాక్టర్ శ్రీనివాస్ దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు, ఒక వృద్ధురాలు ఉన్నారు. డాక్టర్ శ్రీనివాస్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక సమస్యలు కారణమా? లేక మరేదైనా కారణంతో వీరు ఆత్మాహుతికి పాల్పడ్డారా? లేక ఎవరైనా హత్య చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం ను రప్పించి ఆధారాలను సేకరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

