Thu Mar 19 2026 02:47:29 GMT+0530 (India Standard Time)
Breaking : నీటి గుంటలో పడి ఇద్దరు విద్యార్థుల మృతి
ప్రకాశం జిల్లా పామూరు మండలం డీవీ పాలెంలో విషాదం నెలకొంది. ఇద్దరు విద్యార్థులు నీటి గుంటలో పడి మరణించారు

ప్రకాశం జిల్లా పామూరు మండలం డీవీ పాలెంలో విషాదం నెలకొంది. ఇద్దరు విద్యార్థులు నీటి గుంటలో పడి మరణించారు. నీటి గుంటలో ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మరణించినట్లు ఆలస్యంగా కనుగొన్నారు. ఈతకొడదామన్న ఉత్సాహంతో ఇద్దరు విద్యార్థులు నీటి కుంటలో వెళ్లడం, లోతు ఎక్కువగా ఉండటంతో మరణించినట్లు స్థానికులు చెబుతున్నారు.
పామూరుకు చెందిన...
మృతులు పామూరు చెందిన పదహారేళ్ల గౌతమ్, పదిహేడేళ్ల చరణ్ గా గుర్తించారు. విద్యార్థుల మృతితో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

