Thu Mar 19 2026 07:45:09 GMT+0530 (India Standard Time)
Breaking: ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారుల మృతి
కరీంనగర్ జిల్లా అలుగునూరులో విషాదం నెలకొంది. ఈతకెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు

కరీంనగర్ జిల్లా అలుగునూరులో విషాదం నెలకొంది. ఈతకెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మానేరు వాగులో ఈతకెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంతో విషాదం అలుముకుంది. మృతులను వీరాంజనేయులు (16) , సంతోష్ (13), అనిల్ (14గా గుర్తించారు. వీరి తల్లిదండ్రులు కరీంనగర్ జిల్లాలో వలస కూలీలుగా పనిచేస్తున్నారు.
ప్రకాశం జిల్లాకు చెందిన...
వీరిది సొంత స్థలం ప్రకాశం జిల్లా చీమకుర్తి అని తెలిసింది. ఈతకు వెళ్లి చిన్నారులు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

