Wed Mar 18 2026 20:06:22 GMT+0530 (India Standard Time)
ఘోర అగ్నిప్రమాదం : 14 మంది మృతి
జార్ఖండ్ లోని ధనబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది మరణించారు.

జార్ఖండ్ లోని ధనబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది మరణించారు. ఒక అపార్ట్మెంట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఈ విషాదం చోటు చేసుకుంది. అనేక మంది గాయపడ్డారు. పదమూడు అంతస్థులున్న అపార్ట్మెంట్ లో మొత్తం 400 మంది వరకూ నివాసముంటున్నారు.
అపార్ట్మెంట్ లో...
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మంటలను ఆర్పేందుకు శ్రమించారు. మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారని తెలిసింది. పది అంబులెన్స్‌లతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.
Next Story

