Thu Jan 29 2026 20:31:02 GMT+0000 (Coordinated Universal Time)
Delhi : ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. నలుగురు సజీవ దహనం
ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. నలుగురు సజీవ దహనయ్యారు. మృతుల్లో తొమ్మిది నెలల చిన్నారి కూడా ఉంది. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉందని వైద్యులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి పంపి చికిత్స అందిస్తున్నారు.
పొగతో ఊపిరాడక...
షాదారా ప్రాంతంలో ఒక ఇంట్లో చెలరేగిన మంటలతో ఊపిరాడక నలుగురు మరణించారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. తొలుత కింది అంతస్థులో మంటలు చెలరేగడంతో పైకి పొగలు వ్యాపించాయి. నివాసంలో రబ్బరు వంటి పదార్థాలు ఉండటంతో పొగ తీవ్రత ఎక్కువ కావడం వల్లనే ఊపిరాడక మరణించారు. మొత్తం నాలుగు అంతస్థుల భవనంలో మొదటి అంతస్ళులో యజమాని ఉంటుండగా, మిగిలిన వాటిలో అద్దెకు ఉంటున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story

