Thu Sep 12 2024 12:21:49 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురి మృతి
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డ ప్రమాదం జరిగింది. నలుగురు కూలీలు మృతి చెందారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డ ప్రమాదం జరిగింది. నలుగురు కూలీలు మృతి చెందారు. ఆలేరు మండలం మంతపురి బైపాస్ రెడ్డు వద్ద డివైడర్ పనులు చేస్తున్న కూలీలపై ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. డివైడర్ ను ఢీకొన్న తర్వాత అక్కడే ఉన్న ట్రాక్టర్ ను కూడా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెదారు.
అందరూ కూలీలే...
మృతులందరూ కూలీలుగానే గుర్తించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి డివైడర్ ను ఢీకొనడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.
Next Story