Sat Mar 07 2026 15:36:55 GMT+0530 (India Standard Time)
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... 22 మందికి గాయాలు
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడటంతో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడటంతో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విజయనగరం జిల్లాలోని బొండపల్లి మండలం చామలవలసలో ఈ ఘటన జరిగింది. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పెళ్లికి వెళ్లి వస్తుండగా....
విజయనగరం జిల్లా బొండపల్లి మండలం చామవలస గ్రామానికి చెందిన వీరంతా కిండాం అగ్రహారంలో పెళ్లి చూసుకుని తిరిగి వస్తుండగా అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. పెళ్లి బృందం కావడంతో ఎక్కువ మంది ట్రాక్టర్ లో కూర్చున్నారని, అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.
Next Story

