Fri Mar 20 2026 12:04:13 GMT+0530 (India Standard Time)
వంతెన పై నుంచి పడిన కారు.. ఏడుగురు మెడికోలు మృతి
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వైద్య విద్యార్థులు మృతి చెందారు.

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వైద్య విద్యార్థులు మృతి చెందారు. మహారాష్ట్రలోని వార్థా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వైద్య విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి వంతెన పై నుంచి పడటంతో ఏడుగురు మృతి చెందారు.
అతి వేగమేనా?
ఏడుగురు వైద్య విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో విషాదం చోటు చేసుకుంది. వంతెన పై నుంచి అదుపు తప్పి కారు పడటానికి వేగంగా ప్రయాణించడమేనని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Next Story

