Tue Sep 10 2024 10:35:07 GMT+0000 (Coordinated Universal Time)
మహారాష్ట్ర లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్ర గాయపడ్డారు
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్ర గాయపడ్డారు. కారు, రెండు బైక్ లను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పూనే - అహ్మద్ నగర్ జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
రెండు బైకులను....
ఈ ప్రమాదంలో గాయపడిన ఐదుగురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వేగంగా వస్తున్న కారను, బైక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్ లపై ఉన్న వారే మరణించారని పోలీసులు చెబుతున్నారు.
Next Story