Sat Oct 12 2024 06:05:49 GMT+0000 (Coordinated Universal Time)
Kadapa: చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరి మృతి
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంటిమిట్ట చెరువులోకి ఒక కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంటిమిట్ట చెరువులోకి ఒక కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి ఒంటిమిట్ట చెరువులోకి దూసుకెళ్లడంతోనే ఈప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
రాయచూరు జిల్లా....
మృతులు రాయచూరు జిల్లా సిందనూరు కు చెందిన వారిగా గుర్తించారు. మృతులు చంద్రగుప్త (78), మహంకాళి (27)గా చెబుతున్నారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతి వేగంగా రావడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story