Fri Oct 11 2024 08:40:48 GMT+0000 (Coordinated Universal Time)
గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం ... ఇద్దరు మృతి
గుంటూరు జిల్లా నరసరావుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
గుంటూరు జిల్లా నరసరావుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. గుంటూరు జిల్లా నరసరావుపేట దేచవరం అడ్డరోడ్డు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ఇటుకల ట్రాక్టర్, మరో వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఇటుకల ట్రాక్టర్....
ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రగాయాలపాలయ్యారు. క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా గుళ్లాపల్లి వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story