Fri Oct 04 2024 05:49:21 GMT+0000 (Coordinated Universal Time)
రాజస్థాన్ లో ఘోర ప్రమాదం..9 మంది మృతి
రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు.
రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారు నదిలో పడటంతో ఈ ప్రమాదం జరిగింది. వరుడితో సహా 9 మంది మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది. రాజస్థాన్ లోని కోట సమీపంలో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చంబల్ నదిలో పడిపోయింది.
పెళ్లి వేడుక కోసం....
పెళ్లి వేడుక కోసం ఉజ్జయినికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కోట సమీపంలోని కల్వర్టు వద్ద కారు అదుపుతప్పి నదిలో పడిపోయింది. అతి వేగమే ప్రమాదానికి కారణమంటున్నారు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం తో పోలీసులు క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. కారులతో 9 మృతదేహాలను గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story