Sun Dec 14 2025 01:45:53 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ మంత్రి ఇంట్లో భారీ చోరీ
మాజీ మంత్రి జవహవర్ ఇంట్లో చోరీ జరిగింది. ఎవరూ ఇంట్లోలేని సమయంలో ఈ చోరీ జరిగింది.

మాజీ మంత్రి జవహవర్ ఇంట్లో చోరీ జరిగింది. ఎవరూ ఇంట్లోలేని సమయంలో ఈ చోరీ జరిగింది. తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరులో ఉన్న జవహర్ కుచెందిన మూడంతస్థుల భవనంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. జవహర్ ప్రధాని పర్యటన నేపథ్యంలో పది రోజుల నుంచి విజయవాడలో ఉంటున్నారు. వారి భార్య పిల్లలు తిరువూరుకు వెళ్లారు.
బంగారు ఆభరణాలతో పాటు...
ఇదే అదనుగా భావించిన కొందరు పకడ్బందీగా జవహర్ ఇంట్లోకి చొరబడి ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. శనివారం రాత్రి ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మూడు బంగారు ఉంగరాలు, నలభై ఐదు వేల రూపాయల నగదులో పాటు, మూడు లక్షల విలువైన సెల్ ఫోన్లు, వెండి అపహరణకు గురయినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తన్నారు.
Next Story

