Sun Oct 06 2024 01:50:11 GMT+0000 (Coordinated Universal Time)
రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్యే కొడుకుకు?
తూర్పు గోదావరి జిల్లా లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కొడుకు గాయాలపాలయ్యాడు
తూర్పు గోదావరి జిల్లా లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కొడుకు గాయాలపాలయ్యాడు. తూర్పు గోదావరి జిల్లా ఐ పోలవరం మండలం ఎదుర్లంక వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. కాకినాడ నుంచి అమలాపురం వైపు వెళుతున్న కారు బలంగా విద్యుత్తు స్థంభాన్ని ఢీకొట్టడంతో ప్రమాం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
అతి వేగమే కారణమా?
కారులో ప్రయాణిస్తున్నది ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమారుడు సుమంత్ గా గుర్తించారు. ఎమ్మెల్యే మేనల్లుడు లోకేష్ కు కూడా గాయాలయ్యాయి. అయితే లోకేష్ కు తీవ్రగాయాలయినట్లు తెలిసింది. వీరిద్దరినీ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగం వల్లనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story