Fri Mar 20 2026 12:04:13 GMT+0530 (India Standard Time)
ఎదురెదురుగా వచ్చి లారీలు ఢొకొని.. ఒకరు మృతి
అనంతపురం జిల్లా గుత్తి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు

అనంతపురం జిల్లాలో ఇటీవల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలకు కారణం నిర్లక్ష్యమే అయినా పదుల సంఖ్యలో అశువులు బాస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా గుత్తి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గుత్తి మండలం టి.కొత్తపల్లి గ్రామం వద్ద ఉన్న బస్టాప్ వద్ద ప్రమాదం జరిగింది.
అక్కడికక్కడే మృతి...
ఎదురెదురుగా వస్తున్న లారీ, టిప్పర్ ఢీకొట్టడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు క్షతగాత్రులయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

