Sun Mar 15 2026 08:54:38 GMT+0530 (India Standard Time)
వనస్థలిపురంలో భారీ దోపిడీ.. రెండు కోట్లు...?
వనస్థలిపురంలో భారీ దోపిడీ జరిగింది. బార్ యజమాని నుంచి రెండు కోట్లను దోచుకున్నారు.

వనస్థలిపురంలో భారీ దోపిడీ జరిగింది. బార్ యజమాని నుంచి రెండు కోట్లను దోచుకున్నారు. బార్ మూసిన తర్వాత నగదుతో ఇంటికి వెళుతున్న బార్ యజమాని వెంకట్రామిరెడ్డి నుంచి దుండగులు దోచుకున్నారు. వనస్థలిపురం చౌరస్థాలో ఈ దోపిడీకి పాల్పడ్డారు. చౌరస్తాలో అడ్డగించిన వెంకట్రామిరెడ్డి నుంచి రెండు కోట్ల నగదును దోచుకున్నారు.
అడ్డగించి...
కాగా వెంకట్రామిరెడ్డిని దగ్గర నుంచి గమనించిన వారే ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు బార్లు, వైన్ షాపుల నుంచి వచ్చిన కలెక్షన్ ను ప్రతి రోజూ ఇంటికి తీసుకెళ్లడం గమనించి రెక్కీ చేసి మరీ దోపిడీకి దిగి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇది తెలిసిన వాళ్ల పనే అయి ఉంటుందన్న కోణంలో విచారిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

