Sun Mar 15 2026 16:35:32 GMT+0530 (India Standard Time)
ఢిల్లీలో ఐఈడీ బాంబుల కలకలం
ఢిల్లీలో భారీగా ఐఈడీ బాంబుల కలకలం రేగింది. సీమాపురిలోని ఒక ఇంట్లో పేలుడు పదార్థాలను పోలీసులు గుర్తించారు

ఢిల్లీలో భారీగా ఐఈడీ బాంబుల కలకలం రేగింది. సీమాపురిలోని ఒక ఇంట్లో పేలుడు పదార్థాలను పోలీసులు గుర్తించారు. దీంతో ఢిల్లీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల కెోసం పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు.
సీమాపురిలో ఒక ఇంట్లో....
గత నెల 26వ తేదీన పెద్దయెత్తున ఉగ్రవాదులు ఢిల్లీలో పేలుళ్లకు పాడే అవకాశముందని ఇంటలిజెన్స్ నివేదికలు తేల్చాయి. అయితే జనవరి 26న ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోలేదు. దీంతో పోలీసులు సయితం ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు ఐఈడీ బాంబులను స్వాధీనం చేసుకోవడంతో మరోసారి చర్చనీయాంశమైంది. పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇంకా ఎక్కెడక్కడ ఇలాంటి పేలుడు పదార్థాలను ఉంచారో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు.
Next Story

