Thu Mar 19 2026 15:03:24 GMT+0530 (India Standard Time)
జమ్మూలో పేలుడు .. నలుగురి మృతి
జమ్మూ కాశ్మీర్ లో భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో నలగురు అక్కడిక్కడే మృతి చెందారు

జమ్మూ కాశ్మీర్ లో భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో నలగురు అక్కడిక్కడే మృతి చెందారు. జమ్మూలోని రెసిడెన్సీ రోడ్డులో ఈ పేలుడు జరిగినట్లు అధికారులు చెప్పారు. పేలుడుకు గల కారణం సిలెండర్ అని తేలింది. పేలుడులో నలుగురు చనిపోగా పదకొండు మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరందరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పరిహారం.....
ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ప్రజలు బయటకు భయంతో పరుగులు తీశారు. అయితే మృతుల కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఒక్కొక్కరికి ఐదు లక్షల పరిహారాన్ని ప్రకటించింది. క్షతగాత్రులకు లక్ష రూపాయలు ప్రకటించారు. స్వల్ప గాయాలయిన వారికి 25 వేలు ప్రకటించారు.
Next Story

