Sun Feb 01 2026 22:43:53 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
రాజస్థాన్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.

Rajasthan : రాజస్థాన్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. రాజస్థాన్ లోని జాలోర్ లోని అహోల్ లో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపక్కన నిలిపి ఉంచిన ట్రక్కును కారు ఢీకొంది.
వేగంగా వచ్చి...
తఖత్గఢ్ నుంచి చరలి అహోర్ వెళుతున్న కారు 325వ నెంబరు జాతీయ రహదారిపై ట్రక్కును ఢీకొనింది. గ్రానైట్ లోడ్ తో ఉన్న ట్రక్కును కారు ఢీకొట్టడంతో కారులో ఉన్న ఐదుగురు మృతి చెందారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story

