Thu Mar 19 2026 01:44:35 GMT+0530 (India Standard Time)
Delhi : ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు.

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. ఢిల్లీలోని పీతంపుర ప్రాంతంలోని ఒక బిల్డింగ్ లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరొకరికి గాయాలయ్యాయి. మరణించిన ఆరుగురు రెండుకుటుంబాలకు చెందిన వారిగా గుర్తించారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు మంటల్లో చిక్కుకున్న ఏడుగురిని రక్షించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది.
ఏడుగురిని రక్షించిన...
భవనం మొదటి అంతస్తులో తొలుత మంటలు చెలరేగి మూడు ఫ్లోర్లను ఆక్రమించాయి. అయితే మంటలతో చెలరేగిన పొగతోనే ఊపిరాడక కొందరు మరణించారని ప్రత్యక్ష సాక్షులు చెబుుతన్నారు. మృతిచెందిన ఆరుగురిలో నలుగురు మహిళలు ఉన్నారు. వీరంతా ముప్పయి నుంచి అరవైఏళ్ల వయసులోపు వారే. అయితే ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని ప్రాధమికంగా అంచనా వేశారు. దీనిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
Next Story

