Thu Mar 19 2026 07:21:54 GMT+0530 (India Standard Time)
ఫైర్ యాక్సిడెంట్.. పది మంది మృతి
చైనాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించారు. తొమ్మిది మంది వరకూ గాయాలపాలయ్యారు

చైనాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించారు. తొమ్మిది మంది వరకూ గాయాలపాలయ్యారు. చైనాలోని షింజియాంగ్ లో ఈ దుర్ఘటన జరిగింది. ఒక అపార్ట్మెంట్ లో చెలరేగిన మంటలతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది.
సహాయక చర్యలు...
అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ప్రమాదస్థలికి చేరుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రమాదానికి గల కారణాలను తెలసుకునేందుకు విచారణ చేపట్టారు.
Next Story

