Sun Feb 01 2026 16:32:09 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీ అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి
సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మరణించారు

సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మరణించారు. ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పది మంది కార్మికులు గాయాలపాలయ్యారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
పది మందికి గాయాలు...
గాయపడిన పది మంది కార్మికులును చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో ఫ్యాక్టరీలో యాభై మంది కార్మికులు ఉన్నారని తెలిసింది. దీంతో కార్మికుల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ప్రమాదానికి కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు లోపల రియాక్టర్ పేలి భవనాల శకలాలు ఐదు వందల మీటర్ల ఎత్తున ఎగిసిపడ్డాయని స్థానికులు చెబుతున్నారు.
Next Story

