Sun Mar 22 2026 02:21:01 GMT+0530 (India Standard Time)
పాక్ లో ఘోర రోడ్డు ప్రమాదం .. 10 మంది మృతి
పాకిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పది మంది అక్కడికక్కడే మృతి చెందారు

పాకిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పది మంది అక్కడికక్కడే మృతి చెందారు. పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా పర్వత ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మార్జాన్ జిల్లా నుంచి కాల్ కోట్ వైపు వెళుతున్న ఒక వ్యాను అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో పది మంది మరణించగా, పదహారు మందికి తీవ్రగాయాలయ్యాయి.
మృతుల సంఖ్య ....
క్షతగాత్రుల్లో పది మంది వరకూ సీరియస్ గా ఉందని అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. పోలీసులు ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

