Sun Feb 01 2026 10:26:55 GMT+0000 (Coordinated Universal Time)
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్పూర్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే సిరిసిల్ల నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమయింది. కారులో ఉన్న ఐదుగురు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
టైరు పేలడంతో....
గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలతో పాటు ఒక బాలుడు కూడా ఉన్నట్లు గుర్తించారు. బస్సు టైరు ఒక్కసారిగా పేలడంతో అదుపుతప్పి కారును ఢీకొనిందని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

