Sun Mar 15 2026 09:37:31 GMT+0530 (India Standard Time)
ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. కారు వరద తాకిడికి కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది మరణించారు.

ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. కారు వరద తాకిడికి కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది మరణించారు. వీరంతా యాత్రికులుగా గుర్తించారు. మరణించిన వారిలో ఆరుగురు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నైనిటాల్ కురుస్తున్న భారీ వర్షాలకు ధేలా నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది.
పంజాబ్ కు వెళుతూ...
కారులో ప్రయాణిస్తున్న యాత్రికులు పంజాబ్ కు తిరిగి వెళుతుండగా వరదలో కొట్టుకుపోయింది. మరణించిన వారంతా పంజాబ్, పాటియాలా, రామ్నగర్ ప్రాంతాలకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Next Story

