Sat Dec 06 2025 02:12:41 GMT+0000 (Coordinated Universal Time)
కావేరి నదిలో నలుగురు యువకుల మృతి
తమిళనాడులో విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లిన విద్యార్థులు కావేరి నదిలో మరణించారు

తమిళనాడులో విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లిన విద్యార్థులు కావేరి నదిలో మరణించారు. తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో ఈ ఘటన జరిగింది. చనిపోయిన వారంతా మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులే కావడం మరొక విషాదం. అంతా ఇరవై ఏళ్లలోపు వారే కావడంతో వారి కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.
మృతులంతా...
సేలంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న మణికందన్, ఎం. సెల్వం, పాండ్యరాజన్, ఎం. మణికందన్లుగా గుర్తించారు. సంగం జిల్లా సంగకరగిరి మండలం కల్వదంగం గ్రామం వద్ద కావేరి నదికి ఈతకు వెళ్లిన యువకుల్లో ఒకరు మునిగిపోతుండగా అతడిని రక్షించేందుకు మిగిలిన వాళ్లు కూడా బలయ్యారు. మొత్తం పదిహేను మంది ఈతకు వెళ్లగా నలుగురు మరణించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

