Sun Feb 01 2026 16:31:42 GMT+0000 (Coordinated Universal Time)
నీటి గుంటలో పడి ఇద్దరు యువకులు మృతి
ప్రకాశం జిల్లాలో విషాదం నెలకొంది. నీటి గుంటలో పడి ఇద్దరు యువకులు మరణించిన ఘటన వెలుగు చూసింది.

ప్రకాశం జిల్లాలో విషాదం నెలకొంది. నీటి గుంటలో పడి ఇద్దరు యువకులు మరణించిన ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన టంగుటూరు మండలం వాసెపల్లిపాడులో జరిగింది. టంగుటూరు మండలం పెళ్లూరు చెరువులో ఈతకొట్టేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు గుంటలో పడి ఊపిరాడక మరణించారు. యువకులు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులుపోలీసులుకు ఫిర్యాదు చేశారు.
ఒకరి మృతదేహం...
సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు నీటి గుంటలో ఒక మృతదేహాన్ని గుర్తించారు. దానిని నవీన్ అనే యువకుడిగా గుర్తించారు. మరో యువకుడు వెంకటేశ్వర్లు మృతదేహం మాత్రం లభ్యం కాలేదు. అందుకోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువకుల మృతితో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

