Sat Mar 07 2026 17:06:16 GMT+0530 (India Standard Time)
విషాదం.. పిడుగుపడి నలుగురు మృతి
ఏలూరు జిల్లాలో విషాదం నెలకొంది. పిడుగు పడి నలుగురు మృతి చెందారు

ఏలూరు జిల్లాలో విషాదం నెలకొంది. పిడుగు పడి నలుగురు మృతి చెందారు. ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం బోగోలు లో ఈ విషాదం జరిగింది. జామాయిల్ తోటలో పనిచేసేందుకు ముప్ఫయి మంది కూలీలు వచ్చారు. వారు నిద్రలో ఉండగానే పిడుగు పడింది. ఒక్కసారిగా పిడుగు పడటంతో కూలీలు పరుగులు తీశారు.
నిద్రిస్తున్న సమయంలో...
అయినా పిడుగుపాటుకు నలుగురు మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. జామాయిల్ తోటలను నరికేందుకు తూర్పు గోదావరి జిల్లా అన్నవరం నుంచి బోగోలు వచ్చారు. అక్కడే జామాయిల్ తోటల వద్ద గుడారాలు వేసుకుని ఉంటున్నారు. పిడుగు పడటంతో నలుగురు మృతి చెందారు. గాయపడిన మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది.
Next Story

