Fri Dec 05 2025 13:59:55 GMT+0000 (Coordinated Universal Time)
మసీదులో బాంబు పేలుడు
పాకిస్థాన్ లో తీవ్ర విషాదం నెలకొంది. పెషావర్ లోని మసీదులో ఉగ్రవాదుల దాడిచేశారు

పాకిస్థాన్ లో తీవ్ర విషాదం నెలకొంది. పెషావర్ లోని మసీదులో ఉగ్రవాదుల దాడిచేశారు. ఆత్మాహుతి దాడి చేయడంతో అక్కడికక్కడే ఇరవై ఐదు మంది మరణించారని చెబుతున్నారు. 120 మందికి పైగా గాయాలు పాలయ్యారని సమాచారం. ఎవరు ఎందుకు ఈ దాడి చేశారన్నది ఇంకా తెలియరాలేదు.
ప్రార్థనలు జరుగుతున్న...
మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో బాంబు పేలడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని చెబుతున్నారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి పంపి చికిత్స అందిస్తున్నారు. ఉగ్రవాదుల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. పెషావర్ ఆసుపత్రి గాయపడిన కుటుంబాల వారి ఆర్తనాదాలతో మారుమోగుతుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
- Tags
- bomb blast
- mosque
Next Story

