Sat Jul 27 2024 02:14:00 GMT+0000 (Coordinated Universal Time)
జీవిత రాజశేఖర్ కు సైబర్ నేరగాళ్ల కుచ్చుటోపీ
జియో బహుమతుల పేరట పెద్దయెత్తున మోసం జరిగింది. సినీనటి జీవిత రాజశేఖర్ ను మోసం చేశారు.
![జీవిత రాజశేఖర్ కు సైబర్ నేరగాళ్ల కుచ్చుటోపీ జీవిత రాజశేఖర్ కు సైబర్ నేరగాళ్ల కుచ్చుటోపీ](https://www.telugupost.com/h-upload/2022/11/26/1441465-jeevitha-rajasekhar.webp)
జియో బహుమతుల పేరట పెద్దయెత్తున మోసం జరిగింది. సినీనటి జీవిత రాజశేఖర్ ను మోసం చేశారు. జియో బహుమతులు సగం ధరకే చెల్లిస్తామని చెప్పి చీటింగ్ చేశారు. సగం ధరలకే బహుమతులు ఇస్తామంటూ తెలిసిన వారి పేర్లు చెప్పి నమ్మించి మోసం చేశారు. దీంతో జీవిత రాజశేఖర్ మేనేజర్ వారి ఖాతాకు లక్షన్నర బదిలీ చేశారు.
జియో బహుమతుల పేరట...
డబ్బు బదిలీ చేసిన తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో అనుమానం వచ్చి వారు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నైకి చెందిన నరేష్ ఈ మోసానికి పాల్పడినట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ నరేష్ సినీనటులతో పాటు ప్రొడ్యూసర్లను కూడా మోసం చేశారని పోలీసులు చెబుతున్నారు.
Next Story