Sun Mar 15 2026 06:44:04 GMT+0530 (India Standard Time)
తమిళనాడులో భారీ పేలుడు.. నలుగురు మృతి
తమిళనాడులో టపాసుల తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మరణించారు

తమిళనాడులో టపాసుల తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మరణించారు. మరో ఎనిమిది మంది గాయాలపాలయ్యారు. తమిళనాడులోని విరుధ్ నగర్ టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు.గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గాయపడిన వారిలో...
గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. టపాసుల తయారీ పరిశ్రమలలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ యాజమాన్యాలు తగిన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

