Fri Sep 13 2024 01:19:27 GMT+0000 (Coordinated Universal Time)
ముగ్గురిని బలితీసుకున్న మావోలు
బీజాపూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇన్ఫార్మర్ల పేరుతో మావోయిస్టులు ముగ్గురిని కాల్చి చంపారు
బీజాపూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇన్ఫార్మర్ల పేరుతో మావోయిస్టులు ముగ్గురిని కాల్చి చంపారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గత కొంతకాలంగా మావోయిస్టుల ఆనుపానులు పోలీసులకు తెలిసిపోతున్నాయి. దీంతో వారు మావోయిస్టులున్న ప్రాంతాలపై పోలీసులు దాడులు చేసి ఎన్ కౌంటర్ చేశారు.
ముగ్గురిపై కాల్పులు....
అయితే పోలీసులకు సమాచారం ఇస్తున్న వారిని మావోయిస్టులు గుర్తించారు. ఇద్దరు యువకులు, ఒక బాలిక పోలీసు ఇన్ఫార్మర్లని భావించిన మావోయిస్టులు వారిని హతమార్చారు. ఎవరైనా పోలీసులకు కోవర్టులుగా వ్యవహరిస్తే ఇదే గతి పడుతుందని మావోలు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో బీజాపూర్ అటవీ ప్రాంతంలో విషాదం అలుముకుంది.
Next Story