Fri Sep 13 2024 15:34:51 GMT+0000 (Coordinated Universal Time)
BoyFriend: బాయ్ ఫ్రెండ్.. కాలయముడయ్యాడు
20 ఏళ్ల యువతిని ఆమె ప్రియుడే దారుణంగా
20 ఏళ్ల యువతిని ఆమె ప్రియుడే దారుణంగా హత్య చేశాడు. ప్రియురాలిని కత్తితో పొడిచి చంపి, ఆమె మృతదేహాన్ని నవీ ముంబైలోని రైల్వే స్టేషన్ సమీపంలోని పొదల్లో పడేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఉరాన్ రైల్వే స్టేషన్ సమీపంలోని పొదల్లో యువతి మృతదేహం లభ్యమైనట్లు తెల్లవారుజామున 2 గంటలకు పోలీసులకు కాల్ వచ్చిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నవీ ముంబై) వివేక్ పన్సారే తెలిపారు. శరీరంపై అనేక గాయాలు, కత్తిపోట్లు ఉన్నాయని, ఆమెను చాలా దారుణంగా చేశాడని పోలీసులు తెలిపారు.
హత్యకు గురైన మహిళను యశశ్రీ షిండేగా గుర్తించారు. ఆమె కనిపించకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే ఆమె శవమై కనిపించింది. ఉరాన్ కు చెందిన 20 ఏళ్ల యువకుడు యశశ్రీ బాయ్ ఫ్రెండ్ గా ఉన్నాడని.. అతడు బేలాపూర్లో పని చేసేవాడని తేలింది. మా ప్రాథమిక దర్యాప్తులో ప్రేమ వ్యవహారంలో గొడవలు జరగడంతో ఈ మహిళ హత్య జరిగిందని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే యువతితో పాటు ప్రియుడు కూడా అదృశ్యమయ్యాడని, అతడి ఆచూకీ లభించలేదన్నారు. హత్య కేసు నమోదు చేశామని, అతడి కోసం ఐదు పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని ఓ పోలీసు అధికారి తెలిపారు.
Next Story